నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాలలో తొలివిడతగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రైతులకు సంబంధించిన చివరి గింజ వరకు మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఏ ఒక్కరు కూడా దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సన్న రకం ధాన్యానికి బోనస్ కూడా రూ.500 చొప్పున చెల్లించడం జరుగుతుందని వివరించారు. త్వరలో మిగతా సెంటర్లను కూడా వరుస క్రమంలో ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో కోనా సమందర్ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, ఐకెపి ఎపియం కుంట గంగాధర్, డైరెక్టర్లు జైడి శ్రీనివాస్, బానవత్ రాములు, నాయకులు తక్కురి దేవేందర్ పటేల్, అనిల్, రమేష్, నరసయ్య, రూపాగౌడ్, హనుమండ్లు, క్యాతం గంగారెడ్డి, సీసీలు వర్ణం శ్రీనివాస్, పీరియా, అమీర్ నగర్, ఇనాయత్ నగర్, కోనాపూర్ గ్రామాల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.