నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని బాడ్సి ముదక్ పల్లి గ్రామాలలో గురువారం రోజున మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగా రెడ్డితో కలిసి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల దళారూలను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని కచ్చితంగా ప్రతి గింజను కూడా రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. కచ్చితంగా క్వింటాలకు సన్నటి వడ్లకి ఈసారి కూడా రూ.500 బోనస్ ఇస్తుందని, రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రాధా కిషన్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, డైరెక్టర్లు పృథ్వి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.