దళారులను ఆశ్రయించి మోసపోవద్దు..

Don't be fooled by middlemen..– పిఎసిఎస్ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న
నవతెలంగాణ – నవీపేట్
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ధరను పొందాలని నవిపేట్ పీఏసీఎస్ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న అన్నారు. మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 మద్దతు ధరను పొందాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సొసైటీ తరఫున అన్ని రకాలుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, డైరెక్టర్లు గణేష్, సౌదా శ్రీనివాస్, గంగోని రాము, గోపి, గంగాధర్ మరియు రైతులు పాల్గొన్నారు.
Spread the love