పట్టణ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Urban Bar Association election schedule releasedనవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎలక్షన్ అధికారులు సేరియల జగన్, కొత్తపల్లి రాములు గురువారం ప్రకటించినారు. పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 4,5 7వ తేది 4 గంటల లోపు నామినేషన్ వేయాలని, 8వ తేది నాడు నామినేషన్ లో సవరణలు, ఫైనల్ ఓటర్ లిస్ట్ 4 గంటల లోపు ప్రకటిస్తామని.నామినేషన్ ల ఉపసంవరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు 9వ తేది 5 గంటల లోపు ప్రకటిస్తామని తెలిపారు. 11 వ తేది శుక్రవారం నాడు ఎన్నికలు నిర్వహిస్తున్నామని అదే రోజు లెక్కింపు, గెలుపొందిన అభ్యర్థులను వివరాలు ప్రకటిస్తామని ఎలక్షన్ అధికారులు తెలిపారు. ఈ  కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య, ఉపాధ్యక్షులు పోడేటి శంకర్, సెక్రటరీ డి.అరుణ్ కుమార్, న్యాయవాదులు పండిత్ కృష్ణ నరేందర్, మోహన్, జగదీష్, శ్రీధర్, దేవన్న, కృష్ణం రాజు, రమేష్, కిష్టయ్య, మురళీధర్, ప్రవీణ్, చరణ్, సురేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love