నవతెలంగాణ – బెజ్జంకి
హైదారాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు సాయికృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు సంగెం మధు, దొంతరవేణి మహేశ్ ముందస్తు అరెస్టయిన వారిలో ఉన్నారు.