హెచ్ సి యు 400 ఎకరాల భూమి విషయంలో పోరాడుతున్న బీజేవైఎం నాయకులను గురువారం అరెస్టు చేసి ఉప్పునుంతల మండల స్టేషన్ కు తరలించిన పోలీసులు తన సొంత పూచీకత్తూపై వదిలిపెట్టారు. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారో అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరిచి గగ్గోలు పెట్టినా మీకు ఇప్పుడు అది గుర్తులేదా అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడానికి ఏది పడితే అది అమ్మడానికి సిద్ధమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకింతైన జ్ఞానం ఉందా కేవలం అధికారం నిలుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులను అణిచివేయాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని బీజేవైఎం మండల నాయకుడు రాజు ముదిరాజ్ అన్నారు.వారితో పాటు శ్రీకాంత్, శివ ముదిరాజ్, శివ, రాకేష్ లు ఉన్నారు.