నవతెలంగాణ-రామగిరి : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు బేగంపేట ఎక్స్ రోడ్డుకు ఓ కార్యక్రమానికి హాజరుకాగా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామ సమస్యలు మౌలిక వసతులైన త్రాగునీరు, చేతి పంపులు, బోర్ వెల్ లు పని చేయట్లేదని మాట్లాడిన రామగిరి మండల యూత్ ఉపాధ్యక్షులు గోడిశేల సంతోష్ ఈ సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన ఐటీ శాఖ మంత్రి సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, శ్రీనుబాబు, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నూరి శ్రీకాంత్ , తదితరులు ఉన్నారు.