గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 

Babu Jagjivan Ram, a great social reformer– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య 
నవతెలంగాణ – పెద్దవంగర
దేశంలో సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.‌ ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు శ్రీరాం సుధీర్, చింతల భాస్కర్, జాటోత్ హేమని, జాటోత్ పూల్ సింగ్, నిమ్మల విజయ శ్రీనివాస్, రాసాల సమ్మయ్య, చిలుక బిక్షపతి, దంతాలపల్లి శ్రీను, రాంపాక నారాయణ, మహంకాళి యాకయ్య, రాయారపు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love