భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో శనివారం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పకీర్ కొండల్ రెడ్డి తెలిపారు. దేశంలోనే సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్టం, ప్రజా ప్రభుత్వం అని, రాష్టంలో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగే విదంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్ర శ్రీరాములు, మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు సల్ల పాండు, దోనగిరి వేణు,నితిన్,గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్ర మహేష్, శ్రీనివాస్, వినయ్, మహేష్,నరసింహ, చిన్న అంజయ్య, జంగయ్య ,మల్లేశం,జహంగీర్, శివ ,రమేష్,వంశీ, అఖిల్, రేషన్ షాపు డీలర్ మంజుల,గ్రామస్తులు పాల్గొన్నారు.