కొనుగోలు గ్రంధాన్ని ప్రారంభించిన ఏఎంసి వైస్ చైర్మన్

AMC Vice Chairman launches purchase bookనవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని కుర్లా గ్రామ పరిధిలో ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి బోనస్ అందజేస్తుందని, పండించిన వరి ధాన్యం రైతులు ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రంలో తూకాలు చేసుకొని మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం రవీందర్ ఏ ఈ ఓ సమరిన్ కుర్లా మాదన్ ఇప్పర్గా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ధాన్యం రైతులు పాల్గొన్నారు.
Spread the love