మృతికి సంతాపం తెలిపిన సిపిఎస్ నాయకులు

–  స్వర్గపురి వాహనం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ
నవతెలంగాణ  – చండూరు : చండూరు కు చెందిన మస్న సత్తయ్య (92) మృతి చెందడంతో  చండూరు చేనేత పరిరక్షణ సేవాసమితి (సిపిఎస్) నాయకులు మృతదేహాన్ని సందర్శించి  పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు బంధువులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సిపిఎస్ అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ తన సొంత ఖర్చులతో స్వర్గపురి వాహనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ చైర్మన్ రాపోలు ప్రభాకర్   మాట్లాడుతూ పద్మశాలీయులను  చేనేత కార్మికులకు తన వంతు బాధ్యతగా సాయం చేస్తూ వస్తుందన్నారు. మునుముందు మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.  సిపిఎస్ గౌరవ అధ్యక్షుడు ఏలె శ్రీనివాసులు, కోశాధికారి రాపోలు జగదీశ్వర్, పెద్దలు పులిపాటి గోపయ్య, రెడీమేడ్ వస్త్ర దుకాణాల సంఘం చైర్మన్ మల్లికార్జున్, చెరుపల్లి వేణు,  మస్న ఓంకారం తదితరులు ఉన్నారు.
Spread the love