– తహసీల్దార్.. శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవూర
అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయం తో పోషణ్ పక్వాడ కార్యక్రమం విజయ వంతం చేయాలని మండల తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం అమలు పై పెద్దవూర అంగన్వాడీ సూపర్ వైజర్లకు అవగాహన కల్పించారు.అనుముల ప్రాజెక్ట్ పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమం నేటినుంచి నుండి ఏప్రిల్ 22 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విధిగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పోషణ పక్వడ -2025 లో నిర్వహించవలసిన వివిధ రకాల కార్యక్రమాలను 4 ప్రతిపాదిత థీమ్ లుగా నిర్వహించాలని తెలిపారు.మొదటి 1000 రోజులపై దృష్టి సారించి లబ్దిదారుల మాడ్యుల్ ను ప్రజాదరణ పొందించుట గురించి తెలపాలని కోరారు. మాడ్యూల్ అమలు ద్వారా పోషకాహార లోపం నివారించడం,పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలివిధానం పై థీమ్ లను అనుసరించి వివిధ రకాల కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్నారు.భాగస్వామ్య ప్రభుత్వ శాఖలతో వివిధ కార్యక్రమాల నిర్వహణను సమన్వయం చేసుకోవాలని తెలిపారు.పోషకాహార సూచికలను మెరుగుపరచడం కోసం ప్రాజెక్ట్ పరిధిలో పోషకాహార కేంద్రీకృత అవగాహనను తీసుకువచ్చి జనచైతన్యం కలిగించాలని కోరారు. ఎప్పటిలాగే పోషణ పక్వడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నగేష్, ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, అనుముల ప్రాజెక్టు సీడీపీఓ ఉదయ శ్రీ, సూపరిండెంట్ హఫీజ్ ఖాన్,అంగన్వాడీ సూపర్ వైజర్లు వెంకాయమ్మ, శశికళ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.