నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ఆయా గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం ఆశా కార్యకర్తలు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యశాఖ ఆదేశాల మేరకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 7,8 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ పరీక్షల నిమిత్తం 102 అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా అవగాహన కల్పించాలని మెడికల్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు భారతి, సంగీత, ఇందిరా, సవిత, సంతోషి తదితరులు ఉన్నారు.