నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల వార్షికోత్సవం సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, ఉచిత సౌకర్యాలు లభిస్తాయని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు ముఖ్యఅతిథిగా హాజరైన డిఇఓ రాజును ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థుల నాట్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయం, ఎరుక సోది చెప్పడం, నాటకాలు, కరాటే విన్యాసాలు, పిరమిడ్ విన్యాసాలు చూపరులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎమ్మార్వో శివ ప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎంఈఓ రాజా గంగారెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, సెక్టోరియల్ ఆఫీసర్స్, వేణుగోపాల్, రమణారావు, నాగవేందర్, రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.