కొనసాగుతున్న జై బాపు జై భీమ్ జై సంవేదాన్

Ongoing Jai Bapu Jai Bhim Jai Samvedaanనవతెలంగాణ – మద్నూర్
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జై బాపు జై భీమ్ జై సంవేదాన్ పాదయాత్ర కార్యక్రమాలు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు విస్తృతంగా చేపట్టారు. మంగళవారం మద్నూర్ మండలంలోని ఖరగ్, చిన్న తడుగూర్, పెద్ద తడగూర్ ,అంతాపూర్, సోమూర్, రాచూర్, ఈ ఆరు గ్రామాల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంతు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కొండ గంగాధర్ పట్నాల రమేష్ బండి గోపి రాచూరు తాజా మాజీ సర్పంచ్ పార్వతి బాయి శంకర్ పటేల్ రాచూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజు పటేల్ యువ నాయకులు సచిన్ ఆ గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love