బాధితులను అండగా ఉండి ఆదుకుంటాం 

We will stand by and support the victims.– సిరికొండ బలరాం బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
వడగండ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆవాసాలను కోల్పోయిన బాధితులను బిజెపి ఆదుకుంటుందని ఆ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరామన్నారు. మంగళవారం మండలంలో మండల బిజెపి అధ్యక్షుడు మార్క సతీష్ తో కలిసి మండలంలోని పసర కోటగడ్డ పలు గ్రామాలలో కార్యకర్తలతో కలిసి బాధితులను పరామర్శించి ఓదార్చారు. బాధితులకు బియ్యము ఇండ్ల పై కప్పుకునేందుకు పట్టాలను గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు స్వరూపతో కలిసి అందించారు ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.  జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వర్షానికి పంట నష్టమైన పొలాలకు మరియు ఇండ్లకు తక్షణమే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మార్వోలు మరియు స్థానిక అధికారులు గ్రామాలలో పర్యవేక్షణ చేసి డాటాను రెడీ చేసి తక్షిణమే సహాయం అందించాలని కోరారు. పూర్తిగా ధ్వంచమైన పంట పొలాలకు ఎకరానికి 50వేల రూపాయలు  కేటాయించాలని డిమాండ్ చేశారు. వడగళ్ల గాలులకు ద్వంచమైన ఇండ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు ఇండ్లు నిర్మించాలని కోరారు. అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే పంట పొలాల daటాను సేకరించి రైతులకు నష్టపరిహారాన్ని త్వరగా అందించాలని కోరారు. ద్వంచమైన ఇండ్ల లో కుటుంబాలు నివసించే పరిస్థితి లేకపోవడంతో వారి యొక్క బాధ్యతలు జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చొరవ తీసుకుని నిత్యవసర వస్తువులు మరియు తలదాచుకోవడానికి తాత్కాలికమైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .వాతావరణంలో మార్పులను గమనించి ములుగు జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి సాధించి ఎప్పటికప్పుడు మండలాల్లో ఉన్న గ్రామాలకు సమాచారం ఇస్తూ అధికారులు పనులు చేయాలని కోరారు .  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేసి రైతులకు లబ్ధి చేకూర్చే  విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు  . ఈ కార్యక్రమంలో ఎస్టి మూర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జిలకర కృష్ణకర్రరావు ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  మెరుగు సత్యనారాయణ,  అంతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంతిరెడ్డి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు
Spread the love