గ్రామ గ్రామాల్లో కొనసాగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర…

నవతెలంగాణ-వీణవంక: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కడి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన, వాడ వాడలో తిరుగుతూ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తున్నారు.రాజ్యాంగం పట్ల బిజెపి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామెడీ శ్రీపతి రెడ్డి, నల్లగొని సతీష్, ఎండి రషీద్ పాషా,ఇల్లందకుంట ధర్మకర్త మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, నల్ల కొండాల్ రెడ్డి, చిన్నాల ఐలయ్య, పంజాల సతీష్ గౌడ్, తిరుపతి రెడ్డి, గొట్టె రాజయ్య, వోరెం అఖిల్,పత్తి సమ్మి రెడ్డి, మోటం శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, రవి, పోతరవేన సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love