కొనుగోలు కేంద్రాల్లోనే మద్ధతు ధర..

– కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి

– క్వింటాల్ వదిధాన్యానికి రూ.2320,సన్నరకానికి రూ.500 అదనం 
నవతెలంగాణ-బెజ్జంకి : ప్రభుత్వాధేశానుసారం ఐకేపీ,పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్ధతు ధర లభిస్తుందని..రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్,అయా గ్రామాల్లో  ఐకేపీ,పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు,డైరెక్టర్లు,సిబ్బందితో కలసి ప్రారంభోత్సవం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వరిధాన్యానికి రూ.2320 మద్ధతు ధరతో కొనుగోలు చేస్తుందని.. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రూ.500 బోనస్ అందజేస్తూ సన్న రకం వరిధాన్యం కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే అన్నారు.ఏఓ సంతోష్,ఏపీఎం నర్సయ్య,ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాకర్ రెడ్డి,ఒగ్గు దామోదర్,వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,బైరి సంతోష్,ఏఈఓలు, రైతులు హాజరయ్యారు.
సీఎంఆర్ఎఫ్,కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అయా గ్రామాల్లోని బాధితులకు,లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్,కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు.సుమారు 46 మంది లబ్ధిదారులకు రూ.14,14,500 విలువైన చెక్కులు పంపిణీ చేసినట్టు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఎంకాంగ్పీరెడీఓ ప్రవీన్,మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love