
– పాత నేరస్తులను బైండోవర్ చేస్తామని సూచన
– జాతర ఏర్పాట్ల పరిశీలన
నవతెలంగాణ-బెజ్జంకి : మండల కేంద్రంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు శకటోత్సవం,రతోత్సవంలో ఎలాంటి అవాంఛనీయానికి చోటు లేదని..పోలిస్ శాఖ 360 కోఢంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తుందని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను హెచ్చరించారు.బుధవారం మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సీఐ శ్రీను ఆలయ పాలక వర్గం సభ్యులు,వైద్య, అగ్నిమాపక,పారిశుధ్యం,విద్యుత్ అధికారులు,స్థానిక యువకులతో జాతర నిర్వహణపై సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పోలీస్ శాఖ జాతరను పర్యవేక్షిస్తారని..జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేల పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.గత పదేళ్ల క్రితం నుండి కేసులు నమోదై నేర చరిత్ర కలిగిన వ్యక్తుల జాభితాను పరిశీలించి నేడు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని సీఐ సూచించారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆలయ పాలకవర్గం సభ్యులకు సీఐ తెలిపారు. ముఖ్యంగా వృద్దులు,దివ్యాంగుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అనంతరం గుట్టు చుట్టు పర్యవేక్షించి జాతర ఏర్పాట్లను సీఐ పరిశీలించారు.ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్,యువకులు హజరయ్యారు.