ఆంధ్రాకు తరులు తున్న మారు జాతి కలప..

– ట్రాక్టర్ చెడిపోవడం తో ట్రక్ వదిలిన తరలింపు దారులు..
– స్వాదీనం చేసుకున్న అటవీ అధికారులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ కలప ఆంధ్రా కు యదేచ్చగా తరులు తుంది.దొరికితే దొంగ దొరక్కపోతే దొర సామెత లా ఉంది కలప అక్రమ తరలింపు దారులు పరిస్థితి. అశ్వారావుపేట అటవీ రేంజ్ పండువారిగూడెం బీట్ లో గల ఒక వాగు ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నరికి ఆంధ్రాకు మంగళవారం రాత్రి తరలించారు.అయితే ట్రాక్టర్ మరమ్మత్తులకు గురికావడంతో తరలింపు దారులు ట్రక్ ను వదిలి వెళ్ళారు.ఈ విషయం బహిర్గతం కొనడంతో నవతెలంగాణ అటవీ అధికారులను ఆరా తీయగా మడకం భద్రయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో గల చెట్లు పంటకు ఆటంకంగా ఉండటంతో తొలగించినట్లు సంబంధిత బీట్ అధికారి అన్నపూర్ణమ్మ విచారణలో తేలింది.రెవిన్యూ లోని వృక్షాలు అయినప్పటికీ అనుమతులు లేకుండా నరికి నందుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ఓ మురళి తెలిపారు.
Spread the love