పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నవతెలంగాణ – రాయపోల్
రాబోయేతరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పౌష్టికాహారం అందించాలని పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు తప్పనిసరి పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ షబానా అన్నారు. గురువారం రాయపోల్ మండలం రామారం అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ లో భాగంగా చేతుల పరిశుభ్రత, రక్తహీనత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు చిన్నారులకు ఆహారం, ఆట, పాటలు, ప్రేమతో విద్యనందించే అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అలాగే చిన్నారులు పాఠశాలలకు భయం లేకుండా వెళ్లడానికి చదవడం,రాయడం, జ్ఞాపకశక్తితో పాటు మెదడు అభివృద్ధి చెందాలంటే అంగన్వాడీ కేంద్రాల్లో విద్యతోపాటు బొమ్మలు వేయించడం, మాట్లాడించడం, ఆహారపు అలవాట్లలో భాగంగా చిరుధాన్యాలు, ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ పోషణ పక్వాడ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
రక్తహీనత తగ్గించేందుకు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలను అందిస్తామని, రాగులు, జొన్నలు, పెసర్లు, సజ్జలు, బబ్బర్లు, ఉలువలు, పప్పులు మొదలగు వాటిని ఆహారంగా అందిస్తామని తెలిపారు.చేతి పరిశుభ్రత వలన కలిగే లాభాలు అపరిశుభ్రత వల్ల కలిగే సమస్యల పై అవగాహన కల్పించారు. మనం ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలను చేతుల ద్వారానే తీసుకుంటామని అలాంటి చేతులు అపరిశుభ్రంగా ఉంటే అనేక కంటికి కనపడని సూక్ష్మజవులు క్రిములు చేతులపై ఉంటాయని, మనలాగే చేతులను శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యానికి గురవుతున్నారు. తప్పనిసరిగా మలవిసర్జనకు తర్వాత భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవడాన్ని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఆ తర్వాతనే ఆహారపదార్థాలను భుజిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పున్నమ్మ , సరస్వతి, ఆయా రేణుక, గర్భిణి, బాలింత మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love