నవతెలంగాణ – అచ్చంపేట
సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతిరావు ఫూలే కీలకపాత్ర పోషించారని అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అన్నారు. శుక్ర వారం మున్సిపల్ కార్యాలయంలో ఫూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఫూలే అంతులేని కృషి చేశారని వివరించారు. మహాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు మహిళలకు సమాన హక్కులు, విద్యావకాశాలు ఉండాలని కృషి చేశారు. ప్రత్యేకంగా బాలికలకు చదువు ఉండాలి లక్ష్యంతో 1848లో పూణే పట్టణంలో మొదటి పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ యాదయ్య, కౌన్సిలర్లు గౌరీ శంకర్, రమేష్ కార్యాలయం సిబ్బంది ఉన్నారు.