మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో శుక్రవారం సామాజిక విద్య విప్లవకారుడు, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహత్మ జ్యోతిభా ఫూలే చిత్రమాటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నరసయ్య మాట్లాడుతూ… ఫూలే వేసిన ప్రతి అడుగు తొలి అడుగే, ఫూలే ప్రతి కదలికా ఒక సామాజిక విప్లవమే అన్నారు.ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు, శూద్ర, అత-శూద్ర వర్గాలను బ్రహ్మణ, బనియా దోపిడి నుంచి విముక్తి చేసి, శూద్ర, అతి-శూద్ర వర్గాలను జ్ఞానంవైపు నడిపించిన మార్గదర్శకుడని కొనియాడారు. బహుజనుల విద్య, ఉద్యోగాల, రిజర్వేషన్ల కోసం అంటారానితనం నిర్ములనకోసం పోరాడినా యోధుడన్నారు.సత్యం-జ్ఞానాన్వేషణకు అరని వెలుగులా అఖండ జ్యోతై, మహత్ము డై బాబాసాహేబ్ అంబేడ్కర్ పోరాటలకు స్ఫూర్తి నింపి, జ్యోతిలా వెలుగు మార్గం చూపాడన్నారు. స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.కార్యక్రమంలో గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.