
జన్నారం మండలంలోని పైడిపల్లి హనుమాన్ ఆలయంలో, హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా జక్కు సత్తయ్య అండ్ సన్స్ , మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, హోమాలు యజ్ఞాలు కార్యక్రమంలో ఖానాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ నాయక్ పాల్గొన్నారు. ముందుగా హనుమాన్ ఆలయంలో, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు జాన్సన్ నాయక్ స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జక్కు సత్తయ్య అండ్ సన్స్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రాజారాంరెడ్డి జనార్దన్ జాడి గంగాధర్ జక్కబుమేష్, సాయిని ప్రసాద్ నేత, ఫజల్ ఖాన్ వల్లాల నరస గౌడ్,, కొండకూరి రాజు బివిఎస్ నాయక్ భూతం శ్రీనివాస్, వెంకటేష్, దుమల రెడ్డి శివ, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.