ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలి..

Grain purchasing centers should be properly utilized.– ధాన్యం కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణా రెడ్డి..
నవతెలంగాణ – తొగుట
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని తొగుట సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వర్ధరాజ్ పల్లి, గోవర్ధనగిరి, కాన్గల్, లింగంపేట, రాంపూర్, చందాపూర్, వెంకట్రావుపెట, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాలలో పిఎసిఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వడ్లు అమ్మే విషయంలో రైతులకు ఎలాం టి ఇబ్బందులు ఉండకుండా చూడాలని సిబ్బందిని కోరారు. ప్రభుత్వం రైతులకు క్వింటాల్ వరి ధాన్యం కు రూ. 2320/- మద్దతు ధర కల్పిస్తుందని అన్నా రు. అరబెట్టిన ధాన్యం ను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువోస్తే కొనుగోళ్లు వేగవంతం అవు తాయని తెలిపారు. రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కు వడ్ల కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం ను అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మండల వ్యవసాయ అధికారి మోహన్, మాజీ సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు నర్సింలు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఆర్ఐ అశోక్ రాజు, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, మహిపాల్ రెడ్డి, పాత్కుల ఎల్లయ్య, ఏఐఓ సాయికుమార్, సీసీ లు వరలక్ష్మి, విజయ, భాస్కర్, విఓఏ లు, గ్రామ సమైక్య అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love