– కనక ప్రమోద్ మాదిగ
నవతెలంగాణ – కంఠేశ్వర్
భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం భారతీయులకు గొప్ప వరం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుల పైన ఉన్నది. భారత రాజ్యాంగం అంటే సామాజిక న్యాయానికి పునాది. సామాజిక న్యాయం అంటే ఈ దేశంలో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అపౌరులసుస్పష్టం. ఇది రాజకీయ వాటాలో అయినా రిజర్వేషన్లలో వాటా అయిన అనేది చాలా అవసరం. అందుకే సామాజిక న్యాయ కోణంలో, ప్రజాస్వామిక పంథాలో గత 30 ఏండ్లుగా మాదిగలు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటాలు చేసి సాధించడం జరిగింది. రిజర్వేషన్లలో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అనేది రాజ్యాంగ సూత్రం. నేడు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.