ముంబయి : ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియెట్స్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ రెమెడియం లైఫ్ కేర్ లిమిటెడ్ ప్రతిపాదిత రైట్ ఇష్యూకు బాంబే స్టాక్ ఎక్స్చేంజీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత వాటాదారుల నుంచి వృద్ధి మూలధనాన్ని సమీకరించడానికి, సంస్థ కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులు మార్గం సుగమం చేయనున్నాయని ఆ సంస్థ పేర్కింది. రైట్ ఇష్యూ ద్వారా రూ.49.19 కోట్ల నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడంతో పాటుగా వాటాదారుల విలువను పెంచడానికి తాము కట్టుబడి ఉన్నామని రెమిడియం లైఫ్ కేర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఆదర్శ్ ముంజాల్ పేర్కొన్నారు.