నవతెలంగాణ – మునుగోడు: గ్రామాలలో మహిళలు గృహినిలుగా కాకుండా స్వయం శక్తితో ఆర్థికంగా బలోపేతం చెందాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు అన్నారు . గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో పంచాక్షరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందే మహిళలకు కుట్టు మిషన్ అందజేయడంతో 45 రోజులు శిక్షణ పొందిన మహిళలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పత్రాలను అందజేసేందుకు ముఖ్యఅతిథిగా మందుల సైదులు హాజరవడంతో మహిళలు ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ మహిళలను స్వయం శక్తితో ఎదిగేందుకు పంచాక్షరి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు . మహిళల బలోపేతం కోసం తమ వంతు ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కారింగు పల్లవి ,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు లింగస్వామి , కాంగ్రెస్ పార్టి నాయకులు అయితరాజు పెద్దులు , ఏళ్లంకి రమేష్ , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులున్నారు.