
మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు బారడి పోచమ్మ వార్షికోత్సవ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బారడి పోచమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలంతా ఇంటింటా నైవేద్యాలు బోనాలు సమర్పించారు. బారడి పోచమ్మ వార్షికోత్సవానికి బాజా భజంత్రీలతో మొట్టమొదట బోనాల నైవేద్యం ధూప దీప నైవేద్య పూజారిగా సేవలందిస్తున్న సందూర్వార్ శంకర్ ఇంటి నుండి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఆలయ భూమి యజమాని తూమువార్ రామ్ కిషన్, నైవేద్యాలు సమర్పించే భక్తుల కోసం టెన్త్ ల సౌకర్యం ఏర్పాటు చేయించారు. వార్షికోత్సవానికి తానంటూ ముందుంటూ కావలసిన ఏర్పాట్లు ఖర్చులు సమర్పించినట్లు తెలిపారు. బారడి పోచమ్మ అంటే ప్రతి ఇంటి కుటుంబీకులు నైవేద్యాలతో బోనాలతో ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు. బారడి పోచమ్మ వార్షికోత్సవం సందర్భంగా ఇంటింట పండుగ జరుపుకున్నారు.