- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచేర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రామారావు పల్లి ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని గురువారం రాఖీ పండుగ వేడుకలు ప్రధానోపాధ్యాయులుపద్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరిచేతికి ఒక్కరు రాఖీ కట్టుకొని ముందస్తుగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెల అనుబంధం ప్రాముఖ్యతపై విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్,రామారావు పల్లి ఉపాధ్యాయురాలు కవిత,సురేష్,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -