Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమం

కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా  మద్నూర్ మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అసిస్టెంట్లు, గ్రామ సంఘం అధ్యక్షులకు ఒకరోజు  శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏపీఎం జగదీష్ కుమార్ తెలిపారు. మద్నూర్ మండలంలో ఉన్న  పేద, నిరుపేద కుటుంబాలలో ఉన్న  సంఘంలో లేని వారిని  ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి, వారిని  వివిధ సంఘాల్లో చేర్పించడం జరుగుతుంది. అలాగే  60 సంవత్సరాలు నిండిన వృద్ధ మహిళలను గుర్తించి వారిని వృద్ధ సంఘాలుగా ఏర్పాటు చేయడం, దివ్యాంగులను గుర్తించి  వారిని వికలాంగుల సంఘాలగా  తయారు చేయడం, కిశోర బాలికలను గుర్తించి వారిని కూడా సంఘాలుగా తయారు చేయడం జరుగుతుందని ఏపీఎం తెలియజేశారు.

కొత్తగా ఏర్పడిన సంఘాలకు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడంతో పాటు వారికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు, అవకాశాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. కొత్త సంఘాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు ద్వారా గ్రామంలో సామాజిక చిత్రపటం వేసి సంఘాలు లేని వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి సంఘాలను తయారు చేయడం జరుగుతుందని ఉన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా నుండి  డీపీయం సాయిలు, మాట్లాడుతూ.. సంఘాల్లో లేని వారికి  సంఘాల్లో చేర్పించి వారు అనేక రకాలైన జీవనోపాదులు కల్పించాలని సూచించారు. 

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అంది వచ్చినా అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని అదనపు ఆదాయం పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో  వివిధ గ్రామ సంఘాల నుండి వచ్చిన గ్రామ సంఘం అసిస్టెంట్లు, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ సంఘ అధ్యక్షులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీలు, మండల సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad