లైన్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షులు రాఘవరావు
నవతెలంగాణ – పాలకుర్తి
స్వాతంత్ర వేడుకల స్ఫూర్తితో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని లైన్స్ క్లబ్ చార్టర్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు. 79 వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని గురువారం మండలంలోని విసునూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు డైరీలతోపాటు 2024-25 పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు, ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేందర్, ఉపాధ్యాయులు వీరమల్ల బాబయ్య, మాజీ సర్పంచ్ యాకయ్య, మాజీ ఎంపీటీసీ మాటూరి ఆకయ్యలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వాతంత్ర వేడుకల స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES