- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అభిమాన నాయకుడి పచ్చబొట్టు ఓ కార్యకర్త నిండు ప్రాణాలను కాపాడింది. వనపర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త తైలం రమేశ్ నిన్న అకస్మాత్తుగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చి పచ్చబొట్టును చూస్తుండగా శరీరంలో కదలికలు గుర్తించి పిలవగా కదిలాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా రమేశ్ బతికే ఉన్నాడని తేలింది.
- Advertisement -

                                    

