Monday, July 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సిటీలో మరికొద్దిసేపట్లో మాక్‌డ్రిల్: సీపీ సీవీ ఆనంద్

సిటీలో మరికొద్దిసేపట్లో మాక్‌డ్రిల్: సీపీ సీవీ ఆనంద్

- Advertisement -

హైదరాబాద్‌ నగరంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు మరికొద్దిసేపట్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ మాక్‌డ్రిల్‌ సందర్భంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు పెద్దగా సైరన్‌ మోగిస్తారని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -