- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడి రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాల ఎస్పీలతో బదిలీల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కఠినంగా హెచ్చరించారు.
- Advertisement -