- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
వరద పరిస్థితులు, గణేశ్ విసర్జన విధుల్లో తమ అంకితభావం, ధైర్యం, నిస్వార్థ సేవను అందించిన కామారెడ్డి టౌన్–3 విద్యుత్ శాఖ సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలతో పాటు గుర్తుగా సన్మాన చిహ్నాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఇ, రామలక్ష్మి , ఏ డి ఈ కిరణ్ చైతన్య లు పాల్గొని సిబ్బందిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షోభ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో చూపిన కృషి అమూల్యం అన్నారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఈ సిబ్బందిని అభినందించడం మా గర్వకారణం అని తెలిపారు.
- Advertisement -