Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబోల్తాపడిన బస్సు.. పలువురికి గాయాలు

బోల్తాపడిన బస్సు.. పలువురికి గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -