- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంచారు. స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ ఉండనున్నాయి. టికెట్ రేటు రూ. 800 ఫిక్స్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైనల్ చేశారు.
అటు పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “OG” సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000 ఫిక్స్ చేశారు. 25న విడుదలవుతున్న “OG” సినిమాకు అర్థరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
- Advertisement -