- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్ లను పెంచి, లబ్ధిదారులకు అందించాలని వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు ఉప్పల్ బాయి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు శనివారం నిరసన తెలిపారు. అనంతరం వారు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొత్తొల యాదగిరి, మండల అధ్యక్షులు బాలాపురం సాయిలు, ఇనుగుర్తి రాజనర్సయ్య, సిహెచ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -