- Advertisement -
నవతెలంగాణ – సిద్ధిపేట
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి చింతమడకకు వచ్చిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన మహిళలు కవిత రాగానే మంగళహారతులు ఇచ్చి, పసుపు కుంకుమలతో స్వాగతం పలికారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలో జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి, టపాసులు కాల్చి స్వాగతం పలికారు. కవిత రాకతో గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా కనబడింది.
- Advertisement -