- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
- Advertisement -