- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రవేశించింది. HYD పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు ఫైల్ చేసింది. సంతానం లేని దంపతుల నుంచి సరోగసి పేరుతో డాక్టర్ నమత్ర భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
- Advertisement -