- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దసరా పండుగ తర్వాత అరెస్టు అయ్యే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టబద్ధంగా ముందుకెళ్తున్నామని, చాలా ఆధారాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి 2018 ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు.
- Advertisement -