- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్ ఎన్నికలు, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ అబ్జర్వర్‌లను నియమించనుంది. మొత్తం 470 మంది అధికారులు పరిశీలకులుగా పని చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో బై ఎలక్షన్ అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేయనుండగా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.
- Advertisement -