Saturday, May 10, 2025
Homeజాతీయం శ్రీనగర్‌, చండీగఢ్‌లో వరుస పేలుళ్లు..!

 శ్రీనగర్‌, చండీగఢ్‌లో వరుస పేలుళ్లు..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీనగర్‌, చండీగఢ్‌పై పాకిస్తాన్‌ మరోసారి దాడులకు తెగబడింది. శనివారం వేకువ జామున వరుస పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం రాత్రి నుంచి శ్రీనగర్‌ విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలపై పాకిస్తాన్‌ దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. అయితే, విమానాశ్రయం సహా కీలకమైన స్థావరాల సమీపంలో పేలుడు జరిగినట్లు శబ్దాలు వచ్చాయని అధికారులు తెలిపారు. పేలుడు శబ్దాలు వినిపించిన వెంటనే నగరంలో సైరన్లు మోగాయని పేర్కొన్నారు. పేలుళ్ల నేపథ్యంలో లోయలోని చాలా ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ అమలులో ఉందని చెప్పారు.
శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఉదయం 5 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయని పీటీఐ పేర్కొంది. అయితే, దీనిపై అధికారులు మాత్రం స్పందించలేదు. శుక్రవారం రాత్రి పఠాన్‌కోట్‌లో అధికారులు బ్లాక్‌అవుట్‌ విధించారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని కోరారు. శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్ జిల్లాల్లో పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడికి ప్రయత్నించగా.. అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిరోజ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్ ఖై ఫెమే కే గ్రామంలోని ఓ ఇంటిపై పడిపోయిందని ఇళ్లు కారు మంటల్లో చిక్కుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -