- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలంపూర్‌కు వెళ్లనున్నారు. ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
- Advertisement -