- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, సుమారు 24.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -