- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం 23వ విడత నిధులను నేడు రైతుల విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుండి ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులు తమ అకౌంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి. కుడి వైపున ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘Get Data’ పై క్లిక్ చేస్తే మీ ఖాతా వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
- Advertisement -



