Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయంమొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి

మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగుళూరులో మొబైల్ ఫోన్ దొంగతనం ఉదంతం ఊహించని విషాదంగా ముగిసింది. కబ్బన్‌పేట 14వ క్రాస్ వద్ద ఒక న్యాయవాది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు క్షణాల్లో ఆయన చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించారు. బాధితుడు వెంటనే అప్రమత్తమై ‘దొంగ.. దొంగ’ అని గట్టిగా కేకలు వేయడంతో, అదే వీధిలో తలపై పెద్ద సరుకుల మూటను మోసుకుంటూ వెళ్తున్న ఒక రోజువారీ కూలీ సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.

వేగంగా వస్తున్న దొంగల ద్విచక్ర వాహనంపైకి తన తలపై ఉన్న బరువైన మూటను బలంగా విసిరాడు. ఆ దెబ్బకు బైక్ నియంత్రణ కోల్పోయి ఇద్దరు దొంగలు రోడ్డుపై పడిపోయారు.ప్రమాదాన్ని గమనించిన దొంగలు మొబైల్‌ ఫోన్, బైక్‌ను కూడా వదిలేసి పరుగు ప్రారంభించారు. దాదాపు 250 మీటర్ల దూరం పరుగెత్తిన తర్వాత, అందులో ఒక నిందితుడు తీవ్రమైన ఛాతి నొప్పితో రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను పట్టుకుని ఫుట్‌పాత్‌పై కూర్చుండిపోయాడు.

ఆపై స్పృహ తప్పి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడిని పదరాయనపుర ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల జునైద్‌గా పోలీసులు గుర్తించారు. జునైద్ తల్లిదండ్రులు అందించిన సమాచారం ప్రకారం.. అతడికి గతంలోనే తీవ్రమైన గుండె జబ్బు ఉందని, దానికి సంబంధించి గుండె ధమనిలో స్టెంట్ కూడా అమర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడతామనే భయం, ఒత్తిడితో పరుగెత్తడం వల్లే అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -