Friday, July 31, 2026
E-PAPER
Homeజాతీయంరాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ నోటీస్‌

రాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ నోటీస్‌

- Advertisement -

లోక్‌‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేసిన బీజేపీ ఎంపీ అనురాగ్‌ ‌ఠాకూర్‌
న్యూఢిల్లీ : లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రీవిలేజ్‌ (సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు, సభా ధిక్కరణ నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ‘అనుచితమైన, అవమానకరమైన భాషను ఉపయోగించడం, తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం’ ‌పై ఈ నోటీసులు ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ తెలిపారు. మూడు పేజీల నోటీసులో తన అభియోగాలపై సవివరమైన విచారణ, తగిన చర్య కోసం ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని, అలాగే సభకు, కేంద్ర మంత్రి అమిత్ షాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని ఆదేశించాలని స్పీకర్‌ ఓం బిర్లాను నోటీసులో అనురాగ్‌ ‌ఠాకూర్‌ కోరారు. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారనీ, రూల్ 352ను ఉల్లంఘించారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -